calender_icon.png 24 May, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. A1గా రాజ్‌తరుణ్‌

11-07-2024 12:25:24 PM

హైదరాబాద్: సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీలో కీలక విషయాలు బయట పడ్డాయి. రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిపై 420, 493,506 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. సంచలనం రేపిన లావణ్య కేసులో నార్సింగి పోలీసులు హీరో రాజ్‌తరుణ్‌ను ఏ-1గా చేర్చారు. ఏ-2గా మాల్వి మల్హోత్రా, ఏ-3గా మయాంక్‌ మల్హోత్రాను  చేర్చారు. 2010లో రాజ్‌తరుణ్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్‌ను తన కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుందని, రాజ్‌తరుణ్‌కు ఇప్పటివరకు రూ.70 లక్షలు ఇచ్చామని లావణ్య వెల్లడించారు. ఆయన 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చామని వెల్లడించారు. రాజ్‌తరుణ్‌, మాల్వి కలిసి నన్ను డ్రగ్స్‌ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించారు. మాల్వీ, ఆమె సోదరుడు చంపుతామని బెదిరించారని లావణ్య తెలిపారు. 2016లో రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని పేర్కొంది. హాస్పిటల్స్ బిల్స్ కూడా రాజ్ తరుణే చెల్లించాడని తెలిపింది. రాజ్ తరుణ్ , మాల్వీ, మయాంక్ పై చర్యలు తీసుకోవాలని లావణ్య డిమాండ్ చేస్తోంది.