16 March, 2026 | 11:01 AM

ఘట్‌కేసర్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

16-03-2026 09:45 AM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ఘట్ కేసర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఘట్ కేసర్(Ghatkesar) పట్టణంలోని జామా మసీదు ఆవరణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ముస్లిం సోదరులకు ఫ్రూట్ తినిపించి రోజ విరమింపజేసి 

అందరికి రంజాన్  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్ రావు, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, జహంగీర్, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, ముస్లిం నాయకులు అను భాయ్, ఫారూఖ్, ఎండి సిరాజ్, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.