18 March, 2026 | 2:48 PM

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: తొమ్మిది మంది సజీవదహనం

18-03-2026 01:10 PM

న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలోని పాలం ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ భవనంలో అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించడంతో, ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి మరణించారని అధికారులు తెలిపారు. మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు భవనం పైనుండి దూకారని, వారిని ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక భవనంలో ఉన్న ఇంట్లో మంటలు చెలరేగినట్లు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ అగ్నిమాపక సేవలకు (DFS) సమాచారం అందడంతో, 30 అగ్నిమాపక వాహనాలతో కూడిన భారీ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 

ఐదు అంతస్తుల ఆ భవనంలోని రెండవ, మూడవ అంతస్తులు నివాస గృహాలున్నాయి. ఘటనా స్థలంలోని దృశ్యాలలో, భవనంలోని కొన్ని భాగాలను మంటలు చుట్టుముట్టడంతో, దాని నుండి దట్టమైన నల్లటి పొగ మేఘాలు ఆకాశంలోకి ఎగసిపడుతున్నట్లుగా కనిపించింది. రద్దీగా ఉన్న ప్రాంతం గుండా ప్రవేశించిన తర్వాత, అగ్నిమాపక సిబ్బంది పొగతో నిండిన భవనంలో విస్తృతమైన గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపైఢిల్లీ సీఎం రేఖా గుప్తా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.