రాజ్యసభ ఎంపీలకు ప్రధాని మోదీ వీడ్కోలు
- రాజకీయాల్లో విశ్రాంతి అనేది ఉండదు
- రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం..
- రాజకీయాల్లో విరమణ ఉండదన్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రాజకీయాల్లో విశ్రాంతి అనేది ఉండదని రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పేర్కొన్నారు. పదవీకాలం ముగిసిన సభ్యులకు రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమ జరిగింది. పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ ఎంపీలకు ప్రధాని మోదీ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మోదీ(PM Modi farewell speech) మాట్లాడుతూ... మీ సేవలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుటుందని కొనియాడారు.
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉటుందని తెలిపారు. దేశాభివృద్ధిలో భాగస్వాములైనందుకు ప్రధాని అభినందనలు చెప్పారు. పదవీ విరమణ చేసిన ఎంపీలు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. చర్చలు జరిగేటప్పుడు ఎన్నో రకాల వాదనలు జరగొచ్చన్న ప్రధాని మోదీ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే అంతిమ పరిష్కారమని తెలిపారు. సభ నుంచి వెళ్లిపోచ్చుగానీ.. వారి సేవలు నిరంతరం కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. సభ నుంచి వెళ్లేవారు.. కొత్తగా వచ్చే వారికి స్ఫూర్తిగా నిలుస్తారని పీఎం మోదీ పేర్కొన్నారు.




