గరం మసాల ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్
02-04-2026 12:33 AM
- కంపెనీలో 50 నుంచి 60 మంది వర్కర్లు సేఫ్
రూ.2.5లక్షలు ఆస్తి నష్టం.. ఫైర్‌మన్‌కు గాయం
చేవెళ్ల, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్ద వార్డు రెవిన్యూలోని బిఎస్‌ఎఫ్ గరం మసాలా ఫ్యాక్టరీలో బుధవారం ఫైర్ ఆసిడెంట్ జరిగింది. స్థాని క స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... బుధవారం మధ్యాహ్నం 12:50 ఘటన స్థలానికి చేరుకొని మం టల అదుపులోనికి తెచ్చామన్నారు. ఫైర్ ఫైటర్స్ సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోనికి తెచ్చారు. ఈ ఘటనలో ఓ ఫైర్ ఫైటర్స్‌కి గాయం కాగా రెండు లక్షల ఆస్తి నష్టం జరిగింది. నిత్యం 60 మంది వర్కర్స్ పనిచేస్తున్నప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు.




