20 May, 2026 | 9:51 PM

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం

23-08-2024 03:51 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ లోని సెల్లార్ లో మంటలు అంటుకున్నాయి. హోటల్ భవనం సెల్లార్ లోని జనరేటర్ లో మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో సకాలంలో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. హోటల్ లో ఉన్న వారిని సిబ్బంది వెంటనే బయటకు పంపించారు. ప్రాణనష్టం జరగకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.