30 June, 2026 | 2:31 AM

యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం

15-05-2026 10:30 AM

హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని(Yousufguda) ల్యాండ్‌మార్క్ కన్‌స్ట్రక్షన్స్‌కు(Landmark Construction) చెందిన విశ్వ విహార్(ViswaVihar) అపార్ట్‌మెంట్‌లో 5వ అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ అగ్నిప్రమాదం సంభవించడంతో ఫ్లాట్ యజమానులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ ఘటనకు గల కచ్చితమైన కారణాలు ఇంకా నిర్ధారించాల్సి ఉన్నప్పటికీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Electrical Short Circuit) ఒక కారణంగా ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే, ఐదవ అంతస్తులోని ఫ్లాట్ యజమానుల నుండి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.