సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత
చెన్నై: తమిళనాడు శాసనసభలో(Tamil Nadu Legislative Assembly) 'సనాతన ధర్మ నిర్మూలన' వ్యాఖ్యల ద్వారా కొత్త వివాదాన్ని రేకెత్తించిన DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్(DMK leader Udhayanidhi Stalin), ప్రజలను అగ్ర, నిమ్న కులాలుగా విభజించే ఆ వ్యవస్థను నిర్మూలించడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించడం అంటే ఎవరూ ఆలయానికి వెళ్లకూడదని అర్థం కాదని, ఆలయంలోనే కాకుండా సమాజంలోనూ ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని దాని అర్థమని ఆయన 'X'లో చేసిన ఒక పోస్ట్‌లో వివరించారు.
"తమిళనాడు శాసనసభలో నేను ప్రసంగించినప్పుడు, ప్రజలను విభజించే కుల వ్యవస్థ నిర్మూలించబడాలని నేను పేర్కొన్నాను. దీనికి గాను కొందరు నన్ను విమర్శిస్తున్నారు. నేను భయపడే వ్యక్తిని కాదు. ద్రవిడ ఉద్యమం వ్యతిరేకత నుండే ఆవిర్భవించింది. ఆ కోణంలో, నేను ఒక చిన్న వివరణ ఇవ్వదలచుకున్నాను," అని సభలోని తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులడు ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) 107 స్థానాల్లో గెలుపొంది, కాంగ్రెస్, వామపక్షాలైన (CPI, CPI-M) , IUML, వీసీకే పార్టీలతో మద్దతుతో టీవీకే(Tamilaga Vettri Kazhagam) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.






