24 August, 2026 | 11:34 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

గాజులరామారంలోని అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం

18-06-2025 10:50 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఓ అపార్ట్మెంట్ లో ఏసీ షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి అపార్ట్మెంట్ వాసులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన గాజులరామారం డివిజన్(Gajularamaram Division) మిథిలానగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ మిథిలానగర్ లోని హిల్ టాప్ అపార్ట్మెంట్ లో ప్లాట్ నెంబర్ 101లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఏసీ షాట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది.

దట్టంగా పొగలు వ్యాపించడంతో అపార్ట్మెంట్ లోని 20 ప్లాట్లలో దాదాపు 60 మంది టెర్రస్ వద్దకు చేరుకున్నారు. అపార్ట్మెంట్ వాసులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో కూకట్పల్లి అగ్నిమాపక అధికారి జగన్ మోహన్ వెంటనే స్పందించారు. తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. టెర్రస్ దగ్గర ఉన్న వారిని సురక్షితంగా కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్ సిటీలోని జరిగిన అగ్నిప్రమాదం మరువకముందే ఈ అగ్నిప్రమాదం జరగడంతో అపార్ట్మెంట్ లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.