19 April, 2026 | 7:28 AM

జాతీయ రహదారిపై కంటైనర్‌లో మంటలు

29-11-2024 02:41 PM

పటాన్ చెరు,(విజయక్రాంతి): పటాన్ చెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై ముంబై నుంచి విజయవాడ వైపు వెళుతున్న కంటైనర్ లారీలో శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మత్తు పనులు చేస్తున్న సిబ్బంది ట్రాక్టర్ ట్యాంకర్ లోని నీళ్ళు చల్లి మంటలను ఆర్పారు.