20 August, 2026 | 10:25 PM

రన్నింగ్ కారులో మంటలు

23-05-2024 04:28 AM

రాజేంద్రనగర్, మే 22 (విజయ క్రాంతి):  రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగిన సం ఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టిఫ్‌ఖాన్పూల్ బ్రిడ్జి సమీపంలోని ఆర్మీ స్కూల్ వద్ద రన్నింగ్‌లో ఉన్న కియా కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు దగ్ధమైంది. స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది గంట సేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని, ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.