12 July, 2026 | 6:11 PM

Breaking News

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •  

ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం

23-06-2025 12:27 AM

భారీగా ఆస్తి నష్టం!

రాజేంద్రనగర్, జూన్ 22: ఓ ఫర్నిచర్ గోదాం లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీ స్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురం అలీ భాయ్ మసీదు సమీపంలో ఆదివారం ఉద యం మారు 9 గంటలకు జరిగింది. ఎస్త్స్ర విశ్వనాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్ కే జి ఎన్ గోడౌన్ లో యజమాని జహంగీర్ ఫర్నిచర్ నిల్వ ఉంచాడు. ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు గోదాంకు నిప్పంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి.

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా మంటలు వ్యాపించడంతో వాటిని అదుపులోకి తీసుకురావడానికి సమయం పట్టింది.

ఇలా ఉండగా గోదాం లో నుంచి కొంత భాగం మరో ప్రాంతానికి ఫర్నిచర్ తరలించామని యజమాని జహంగీర్ తెలిపాడు. ఆస్తి ఎంత మేరా నష్టం జరిగిందో అనే వివరాలు తెలియ రాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.