17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పూలే దంపతుల సేవలు చిరస్మరణీయం

23-06-2025 12:26 AM

- పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ జూన్ 22 (విజయ క్రాంతి) : జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బోయపల్లిలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల నేటి యువత వారి గురించి తెలుసుకొని మంచి నడవడిక వైపు ముందుకు సాగేందుకు ఎంతో దోహదపడడం జరుగుతుందని తెలిపారు. కాన్షిరాం,అంబేద్కర్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రయత్నించరని పేర్కొన్నారు.

రిజర్వేషన్లు ఉండడం వల్లనే వెనుకబడిన వర్గాల వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవటం ఎందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఎంతోమంది మహనీయులు ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేయడం జరిగిందని, వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.