27 May, 2026 | 1:42 AM

ఎయిర్ ఇండియా బస్సులో మంటలు

27-05-2026 12:54 AM
  1. డ్రైవర్, క్లీనర్‌లకు తప్పిన పెను ప్రమాదం
  2. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘటన

అబ్దుల్లాపూర్‌మెట్, మే 26: ఎయిర్ ఇండి యా బస్సులో మంటలు చెలరేగి, బూడిదైన సంఘటన ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పెద్ద అంబర్‌పేట్ వద్ద మంగళవారం జరిగిం ది. ఎయిర్ ఇండియా కంపెనీకి చెందిన బస్సు శంషాబాద్ నుంచి పెద్ద అంబర్‌పేట్ మీదుగా ఆటోనగర్ వెళ్తున్న క్రమంలో పెద్ద అంబర్‌పేట్ సమీపంలో రాగానే వెనుక భాగాన బస్సు ఇంజన్‌లో నుంచి పొగలు మొదలై  మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ కిందకు దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బొంగులూరు నుంచి ఫైర్ ఇంజన్.. హయత్ నగర్ నుంచి మరొక ఫైర్ ఇంజన్  వచ్చి మంటలు అదుపు చేశారు.  బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు  ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.