రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి
- టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
- వెలుగుమట్ల, పరిగి, ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌కు వినతి
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి) : రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని, ఆడబిడ్డలనే కనికరం లేకుండా వారి ఇళ్లను కూలగొట్టిస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళలకు వంద రూపాయల చీర ఇచ్చి.. వాళ్లను కోటీశ్వరులను చేశామంటూ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. వెలుగుమట్ల, పరిగి రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత, ట్రిపుల్ ఆలైన్‌మెంట్ మార్పు, రాయగి రిలో భూసేకరణ, కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని, ఆ తర్వాత ఉద్యమిస్తామన్నారు.






