22 May, 2026 | 7:42 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

భారత్‌కు తొలి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటం

28-10-2024 12:00 AM

గ్రాండ్ పీజెంట్ పోటీల్లో రేచల్ గుప్తాకు గోల్డెన్ క్రౌన్

బ్యాంకాక్, అక్టోబర్ 27: పంజాబ్‌కు చెందిన రేచల్‌గుప్తా ప్రతిష్ఠాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని అందుకున్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాల సుందరీమణులు పాల్గొనగా వారందిరినీ వెనక్కు నెట్టి రేచల్ ఈ టైటిల్‌ను సాధించారు. మిస్ గ్రాండ్ కిరీటం సాధించిన తొలి భారతీయురాలిగా రేచల్ చరిత్ర సృష్టించారు.

గ్రాండ్ పీజెంట్ చాయిస్ అవార్డును కూడా గెలుచుకుని మిస్‌యూనివర్స్  లారాదత్తా సరసన నిలిచారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండి యా టైటిల్ గెలుచుకున్న రేచల్.. ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు. ఇప్పుడు గోల్డెన్ క్రౌన్ సాధించడంతో ప్రపంచశాంతి, స్థిరత్వంపై గ్లోబల్ అంబాసిడర్‌గా ఉంటారు.