22 May, 2026 | 8:50 PM

Breaking News

భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •  

హస్తినలో విషగాలి

28-10-2024 12:00 AM

356 పాయింట్లకు పెరిగిన ఏక్యూఐ

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశ రాజధానిలో వాయు కాలుష్యం కొత్త రికార్డు లు సృష్టిస్తున్నది. ఆదివారం కూడా కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయి కి చేరింది. శనివారం నుంచి ఆదివారం వరకు 24 గంటల్లో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 356 పాయింట్లు నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయి (వెరీ పూర్)ని సూచిస్తున్నది.

కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 400 కూడా దాటిందని అధికారులు తెలిపారు. అలీపూర్ (402), ఆనంద్ విహార్ (406), బావన (404), జహంగీర్‌పూర్ (414), నెహ్రూ నగర్ (408), సోనియా విహార్ (401), వివేక్ విహార్ (404)లో అత్యధిక కాలుష్యం నమోదైంది. మరోవైపు నగరం పక్కనే ఉన్న యమునా నది విషపు నురగలు కక్కుతున్నది. నదిలో చాలా ప్రాంతాల్లో తెల్లటి నురగలు కనిపిస్తున్నాయి.