14 August, 2026 | 8:25 PM

Breaking News

80వ స్వాతంత్య దినోత్సవం సందర్బంగా 80 ఆకారంలో పినాకిల్ పాఠశాల విద్యార్థులు   •   సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రథమ స్థానం

17-04-2025 12:14 AM

కరీంనగర్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ నిర్వహించిన ఒలంపియాడ్ లో  కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.  పాఠశాలకు చెందినటువంటి పి. శ్లోక ఇంగ్లీష్ ఒలంపియాడ్లో స్టేట్ 1వ ర్యాంక్, యం.డి అబ్దుల్ అర్హాన్ జనరల్ నాలెడ్జ్ ఒలంపియాడ్లో స్టేట్ 4వ ర్యాంక్, జి. సాయి సంహిత్ మ్యాథ్స్ ఒలంపియాడ్లో స్టేట్ 4వ ర్యాంకు, యం. శివేన్ రెడ్డి మ్యాథ్స్ ఒలంపియాడ్ లో స్టేట్ 4వ ర్యాంకు, డి. స్నిగ్దాశ్రీ మ్యాథ్స్ ఒలంపియాడ్ స్టేట్ 1వ ర్యాంకు, ఎ. వాన్మయి, మ్యాథ్స్ ఒలంపియాడ్లో స్టేట్ 5వ, కె. సాన్వి సైన్స్ ఒలంపియాడ్లో స్టేట్ 5వ ర్యాంకుతో టాపర్స్ గా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.