27 May, 2026 | 12:59 AM

కొనసాగుతున్న మత్స్య సహకార సంఘం నామినేషన్లు

27-05-2026 12:00 AM

కోదాడ, మే 26 :కోదాడ మత్స్య సహకార సంఘం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ఎన్నికల అధికారి ఇందిరా మంగళవారం తెలిపారు. ఖానాపురం, వెంకట్రాంపురం, కోదాడ గ్రామాల పరిధిలోని 9 డైరెక్టర్ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖానాపురం గ్రామం నుంచి శీలం నాగేంద్రబాబు, గుండపల్లి రామారావు డైరెక్టర్లుగా తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఇప్పటివరకు ఎస్సీ కేటగిరి నుంచి ముగ్గురు, జనరల్ కేటగిరి నుంచి 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా మొత్తం 41 నామినేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్న అధికారులు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు వేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు.