27 May, 2026 | 12:29 AM

విద్యుత్ స్తంభం పైనుంచి పడి కాంట్రాక్టర్ మృతి

27-05-2026 12:00 AM

పాలకవీడు, మే :26మండలంలోని జానపహాడ్ దర్గా గ్రామంలో విద్యుత్ వైర్ల మరమ్మతుల చేస్తుండంగా విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభం పైకి ఎక్కిన కాంట్రాక్టర్ విద్యుత్ షాక్కు గురై కిందపడడంతో మృతి చెందిన ఘటన పాలకవీడు మండలంలోని జానపహాడ్ దర్గా సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, విద్యుత్ వైర్లు తెగిపోయాయి.

దీంతో మరమ్మతుల పనులను విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ క్రమంలో దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన విద్యుత్ కాంట్రాక్టర్ కొర్ర రవి(32) మరమ్మతుల కోసం విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు. అయితే అప్పటికే సంబంధిత లైన్లకు విద్యుత్ సరఫరా కొనసాగుతుండడంతో రవి విద్యుత్ షాకు గురై స్తంభం పై నుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని వెంటనే మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినడు. మృతుడి కి భార్య ఒక కూతురు ఉంది.