16 July, 2026 | 12:44 AM

తండ్రి హత్యకు తొమ్మిదేళ్ల తర్వాత ప్రతీకారం

16-07-2026 12:44 AM

డోజర్ రాజును కర్రలతో హత్య చేసిన ఐదుగురు అరెస్ట్

గద్వాల, జూలై 15: శెట్టి ఆత్మకూర్ గ్రామంలో సంచలనం సృష్టించిన డోజర్ రాజు హత్య కేసును గద్వాల రూరల్ పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు.తండ్రి హత్యకు ప్రతీకారంగా పథకం ప్రకారం గుంటిపల్లి రాజు అలియాస్ డోజర్ రాజును  కర్రలతో కొట్టి హత్య చేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వై. మొగులయ్య బుధవారం వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం 2017లో ఆంజనేయులు హత్య కేసులో రాజుకు పదేళ్ల జైలు శిక్ష పడగా ఇటీవల బెయ్పి బయటకు వచ్చాడు.దీంతో ఆంజనేయులు కుమారులు విజయ్ కుమార్,ఓ బాల నేరస్థుడు, బంధువులు లోకేష్, గోవర్ధన్, శ్రీరాములు కలిసి ఈ నెల 10న రాజుపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను గద్వాల పట్టణంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రెండు మోట్సాకిళ్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించగా కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.