ఆటోడ్రైవర్లకు ‘ఆప్’ ఐదు హామీలు
11-12-2024 12:00 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఢిల్లీలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సిద్ధమవుతున్నది. పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఇప్పటికే రెండు విడతల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మేనిఫెస్టోలో భాగంగా మంగ ళవారం ఆటోడ్రైవర్లకు ఐదు హామీ లు ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆటోడ్రైవర్లకు రూ.10 లక్షల జీవిత ప్రమాద బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని, వారి కుమార్తెల వివాహానికి రూ. లక్షల చొప్పున సాయం అందిస్తామ ని, ‘పూచో’ యాప్ ద్వారా పిల్లలకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తామన్నారు.






