బోరుబావిలో ఐదేళ్ల బాలుడు
11-12-2024 12:01 AM
జైపూర్, డిసెంబర్ 10: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఐదేండ్ల బాలు డు 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. ఆర్యన్ మీనా పొలం వద్ద ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. ఆ బాలుడిని రక్షించేందుకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తు న్నాయి. ఆ బాలుడికి ఓ పైపు ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. లోపలికి ఓ కెమెరాను పంపించి బాలుడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థి తిని సమీక్షిస్తున్నారు.






