విచారణకు హాజరైన నెతన్యాహు
11-12-2024 12:00 AM
టెల్ అవీవ్, డిసెంబర్ 10: ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్ర స్తుత ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యా హు తొలిసారి చీటింగ్, అవినీతి, నమ్మక ద్రోహం కేసుల్లో కోర్టు మెట్లెక్కారు. అధ్యక్ష పదవిలో ఉండి నేరా రోపణలు ఎదుర్కొంటున్న తొలి నేత కూడా ఈయనే. ఒకవైపు తనపై నమోదైన కేసులను ఖండిస్తూనే, మరోవైపు మంగళవారం కేసులపై విచారణకు హాజరయ్యారు. ప్రస్తు తం ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావర ణం నెలకొనడంతో భూగర్భంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్‌లో న్యాయస్థానం విచారణ చేపడు తున్నట్లు తెలిసింది.






