యువతి పట్ల అసభ్యప్రవర్తన.. నేపాలీలకు జైలుశిక్ష
హైదరాబాద్: ఈ వారం ప్రారంభంలో నిజాం కళాశాల పీజీ హాస్టల్ సమీపంలో ఒక మహిళను వేధించినందుకు ఐదుగురు నేపాలీలకు (Nepali youths sentenced) స్థానిక కోర్టు శుక్రవారం ఏడు రోజుల జైలు శిక్ష విధించింది. మే 27న ఈ సంఘటన చోటుచేసుకుంది. కింగ్ కోఠిలో నివసిస్తూ క్యాటరింగ్ కార్మికులుగా పనిచేస్తున్న నేపాల్ జాతీయులైన సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ అనే దోషులు మద్యం మత్తులో ఒక యువతిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బషీర్‌బాగ్‌లో యువతిని వేధించిన నేపాలీ యువకులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. యువతి ఫిర్యాదు ఆధారంగా, ఆబిడ్ రోడ్ పోలీసులు ఒక కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. శుక్రవారంనాడు, వారిని నాంపల్లిలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది.






