గోరింటా మెరిసే... మగువా మురిసే
సుల్తానాబాద్ వాసవి మాత దేవాలయంలో వైభవంగా గోరింటాకు వేడుకలు
పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు
సుల్తానాబాద్ , జూలై 19 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆర్య వైశ్య మహిళలు శ్రీ కన్యకా పరమేశ్వరి (వాసవి మాత) దేవాలయం లో గోరింటాకు వేడుకల ను ఆదివారం వైభవంగా నిర్వహించారు... ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చేతులకు, కాళ్ళకు గోరింటాకును పెట్టారు,మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో మహిళలమంతా గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు, మహిళల తో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ గా వస్తుంది.పెళ్ళికి ముందుకూడాగోరింటాకుపెట్టుకుంటారు.అలా పెట్టుకోవడం ద్వారా అది ఎర్రగా పండితే వారి ప్రేమ అంత సౌఖ్యంగా ఉంటుంది అని మహిళలు ఆన్నారు, గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, అలాగే కాళ్లు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చల్లదనంగా ఉంటుందని మహిళలు తెలిపారు.... మహిళలంతా సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు...






