20 July, 2026 | 1:04 AM

ప్రతి జిల్లాలో El Niño కమాండ్ కంట్రోల్ రూమ్: మంత్రి శ్రీధర్ బాబు

19-07-2026 03:45 PM

ఎల్-నినో నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధికారులతో మంత్రుల సమీక్ష

ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళికపై దిశానిర్దేశం

 ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు

ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు 

కరీంనగర్: ఎల్ నినో(El Nino) ప్రభావం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో(Karimnagar District) ముందస్తు సన్నద్ధతపై ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Ministers Duddilla Sridhar Babu), పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎల్-నినో పరిస్థితులపై కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రులు సమీక్షించారు. ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...  వ్యవసాయం, తాగు నీరు, వైద్యం, విద్యుత్, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశామని తెలిపారు. ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఎల్ నినో సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. సాగునీటి విషయంలో ఎలాంటి భేషజాలు లేవని వివరించారు. ఎన్డీఎస్ఏ చెప్తే తప్పకుండా మేడిగడ్డ, కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామన్నారు ఒక్కరోజు లక్ష క్యూసెక్కులు రాగానే విపక్ష నేతలు గోల చేశారని ఆరోపించారు. ప్రస్తుతం గోదావరిలో 16 వేల క్యూసెక్కుల వదర కూడా లేదని తెలిపారు. కేటీఆర్ యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్లు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదని శ్రీధర్ బాబు ఆరోపించారు. పదేళ్ల ఉద్యోగాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ ను ఎవరైనా అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో56 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.