19 July, 2026 | 11:15 PM

శ్రీ చక్రేశ్వర శివాలయ నూతన ఛైర్మన్, కమిటీ సభ్యులకు ఘన సన్మానం

19-07-2026 02:28 PM

బోధన్,జూలై 19(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ చక్రేశ్వర శివాలయం నూతన ఛైర్మన్‌గా లక్ష్మణ్ పటేల్ నియమితులైన సందర్భంగా, అలాగే కమిటీ సభ్యులుగా సున్నం గంగాధర్, వీరప్ప తదితరులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఛైర్మన్ లక్ష్మణ్ పటేల్‌తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బిర్కూర్ బుజ్జి, చంద్రయ్య, నవీన్, నారాయణ, లోకం శ్రీనివాస్, శంకర్ గౌడ్, రవిశంకర్ గౌడ్, ప్రసాద్ కిరాణా, కన్ను గౌడ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.