3 April, 2026 | 2:56 AM

భూదాన్ భూముల దురాక్రమణదారుల ఐదు వాహనాలు సీజ్

03-04-2026 01:27 AM

అక్రమ స్థిర చర ఆస్తులు అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు: పోలీస్ కమిషనర్

ఖమ్మం టౌన్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడి పేద ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసి కూడగట్టుకున్న సుమారు 45 లక్షల విలువ చేసే స్థిర చర ఆస్తుల అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇప్పటికే నిందితుల నుండి10 లక్షల 40 వేల విలువ చేసే ఐదు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమ వ్యాపారాలకు, ఆక్రమణలకు పాల్పడిన నిందుతులపై ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్, ఇతర పోలీస్ స్టేషన్లలో  కేసులు  నమోదు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. స్థిర చర అస్తుల విలువ సుమారుగా 5 వాహనములు రూ.10,40,000, ఇల్లు విలువ  రూ.19,90,000. ఇండ్ల స్థలం రూ. 10 ,00,000, బ్యాంక్ ఖాతా లో ని నగదు రూ.4,48,744 అని, మొత్తము అస్తుల విలువ సుమారు రూ.44,78,744  అని తెలిపారు.