మెస్సీ మ్యాజిక్
హ్యాట్రిక్ గోల్స్‌తో సరికొత్త చరిత్ర
కన్సాన్ సిటీ, జూన్ 17: సాకర్ ప్రపంచకప్‌ను టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనా అదిరిపోయే విజయంతో ఆరంభించింది. దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. ఒకటి కాదు రెండు కాదు హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అర్జెంటీనా 3 గోల్స్‌తో అల్జీరియాను చిత్తు చేసింది.
అర్జెంటీనా తరఫున 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న మెస్సీ 17వ నిమిషంలో గోల్‌తో ఖాతా తెరిచాడు. రోడ్రిగో డీ పాల్ అందించిన ఫ్రీకిక్ అందుకున్న మెస్సీ మిడ్‌ఫీల్డ్ నుంచి దూసుకెళ్లి చాలా దూరం నుంచి పవర్ ఫుల్ షాట్ కొట్టి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. తర్వాత పదే పదే అల్జీరియా గోల్ పోస్టుపై దాడులు చేసింది. ఈ క్రమంలో మెస్సీ మరో రెండు గోల్స్ సాధించాడు. ఈ హ్యాట్రిక్ గోల్స్‌తో మెస్సీ వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ రికార్డును సమం చేశాడు.






