3 August, 2026 | 9:47 AM

ఏఐకి నా స్వరం ఎలా వాడుతారు?

22-05-2024 02:30 AM

న్యూయార్క్, మే 21: చాట్‌జీపీటీ కృత్రిమ మేధ (ఏఐ)ని సృష్టించిన ఓపెన్ ఏఐ కంపెనీపై ప్రముఖ హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్‌సన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.  ఓపెన్ ఏఐ సంస్థ కొత్తగా తీసుకొస్తున్న చాట్‌జీపీటీ 4ఓకు కోసం గాత్రదానం చేయాలని స్కార్లెట్‌ను ఆ సంస్థ కోరింది. అందుకు ఆమె అంగీకరించలేదు. అయినా, ఆ సంస్థ అచ్చం స్కార్లెట్ స్వరాన్ని పోలి ఉన్న కృత్రిమ స్వరాన్ని సృష్టించి చాట్‌జీపీటీ 4ఓలో చేర్చింది. ఈ విషయం తెలిసిన స్కార్లెట్ ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఆ స్వరాన్ని వాడటాన్ని కంపెనీ ఆపేయాలని తన న్యాయవాది చేత నోటీసులు పంపినట్టు చెప్పారు.