26 August, 2026 | 6:17 PM

కటకం అశోక్‌కు పద్మశాలి సంఘం ఘన సన్మానం

26-08-2026 05:34 PM

మహదేవపూర్,ఆగస్టు 26 (విజయ క్రాంతి): మహదేవ్‌పూర్‌ మండలంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేసిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కటకం అశోక్‌ను కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా నియమించడంపై పద్మశాలి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు క్యాతం సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో అశోక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. 


అశోక్‌కు మండల అధ్యక్ష పదవి కల్పించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అలుబాక సుజాత, జిల్లా కోశాధికారి వీరస్వామి, పెనుమల్ల రమేష్, గాదే రమేష్, పంతగాని సమ్మయ్య, పేరిణి గట్టు స్వామి, మాచర్ల అశోక్, మాచర్ల కుమార్, సత్తయ్య బాలిన ప్రకాష్, దోమల రవి, పోగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.