26 August, 2026 | 7:35 PM

గోల్‌తండా గ్రామశాఖ అధ్యక్షుడిగా ధరావత్‌ కుర్వా

26-08-2026 05:43 PM

అభినందించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి

మోతె, ఆగస్టు 26 (విజయక్రాంతి): గోల్‌తండా గ్రామ కాంగ్రెస్‌ పార్టీకి నూతన కమిటీ కొలువుదీరింది. బుధవారం గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడిగా ధరావత్‌ కుర్వాను కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోతె మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి సమక్షంలో గ్రామ కార్యకర్తల ఆమోదంతో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. అధ్యక్షుడిగా కుర్వాను ఎన్నుకున్న అనంతరం కీసర సంతోష్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేయాలని సంతోష్‌రెడ్డి సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులు, కార్యకర్తలకు ధరావత్‌ కుర్వా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ధరావత్‌ భారతి లక్పతి, ఉపసర్పంచ్‌ ధరావత్‌ నాగ, ధరావత్ దస్రు, ధరావత్ శ్రీధర్, గ్రామ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.