19 April, 2026 | 12:35 AM

పుణెలో జలప్రలయం

20-08-2024 03:13 AM
  1. వీధులు, రోడ్లు, సబ్‌వేలు, రైల్వేస్టేషన్లలోకి చేరిన వరద నీరు 
  2. వాడ్‌గావ్ షెరీ ప్రాంతంలో 101.5 మి.మీ వర్షపాతం

పుణె, ఆగస్టు 19: పుణెలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వీధులు, రోడ్లు, సబ్‌వేలు, ప్రధాన రైల్వేస్టేషన్లు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. ప్రధానంగా పుణె రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.  వర్షా లకు కళ్యాణినగర్‌లోని రాంవాడి సబ్‌వేను మూసివేశారు. పింప్రి మున్సిపాలిటీలోని తేర్గావ్ లో అపార్ట్‌మెంట్లలోని కింది అంతస్తులోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాడ్‌గావ్ షెరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 101.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.