ట్రిపుల్ తలాక్‌పై శిక్ష సబబే
20-08-2024 03:15 AM
సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ముస్లిం పురుషుడు తన భార్యకు మూడుసార్లు తలాక్ అని చెప్పి తేలికగా విడాకులు ఇవ్వటాన్ని నేరంగానే పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు ఇచ్చే పురుషుడికి 2019లో అమల్లోకి తెచ్చిన చట్టం ప్రకారం మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నదని, దీనిని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టులో 2017లో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన నేపథ్యంలో ఈ విధానంలో విడాకులు ఇచ్చే వ్యక్తులకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం లేదని దాఖలైన పిటిషన్‌కు కౌంటర్‌గా కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.






