calender_icon.png 4 February, 2026 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరోజీ బాబా ఆశ్రమంలో వసతులపై దృష్టి

04-02-2026 01:07:25 AM

షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ 

జైనూర్ ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న శ్రీ సంత్ గురుదేవ్ సూరోజీ బాబా సేవా ఆశ్రమంలో భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పన కు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపడతామని జైనూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని మహాగామ్ గ్రామంలో సూరోజీ బాబా ఆశ్రమం ప్రాంగణంలో స్థానిక సర్పంచ్ సెడ్మాకి జానేరావు, ఆశ్రమం పీఠాధిపతి మెస్రం కైలాష్ తో కలిసి షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక గురువు సంత్ సూరోజీ బాబా చూపిన మార్గం ద్వారా అనేక కుటుంబాలు చెడు వ్యసనాలు విడనాడి సన్మార్గంలో పయనిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఏటా మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ నిరుపేద జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

అందులో భాగంగా  సామూహిక వివాహాలు నిర్వహణ కోసం భక్తుల సౌకర్యార్థం వేదిక వద్ద రెండు షెడ్లు నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయి సెంటర్ సార్మెడీ ఆత్రం ఆనంద్ రావు, మాజీ సర్పంచులు ఆత్రం పద్మ రాజేశ్వర్, మెస్రం భూపతి, నాయకులు మెస్రం అంబాజీ రావు, జాదవ్ ధరంసింగ్, గ్రామ పెద్దలు కోట్నాక్ నాగు, మాడావి యాదవ్ రావు, గేఢం జగ్జీవన్ , యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.