నీటి వనరుల పరిరక్షణపై దృష్టి సారించండి
22-08-2026 06:26 PM
బోథ్. ఆగస్టు22 (విజయక్రాంతి): నీటి వనరుల పరిరక్షణపై రైతులు దృష్టి సారించాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని దేవుల నాయక్ తండ గ్రామంలో చేపడుతున్న ఫాంపండు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటినుండే నీటి వనరుల పరిరక్షణ పై దృష్టి సారించాలని లేకుంటే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి ఎదురుకోవలసిస్తుంది అన్నారు. ఆయన వెంట ఏపీ ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.






