15 June, 2026 | 7:38 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

మహిళా భద్రతపై దృష్టి సారించాలి

16-10-2024 02:39 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో మహిళల భద్ర తపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై లైంగికదాడి జరగటం ప్ర భుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు.  బాధితురాలికి భరోసా కల్పించాలని, నిం దితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని  డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో  శాంతిభద్రత లపై హోం మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్ ఒక రోజు కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు.