18 April, 2026 | 2:31 PM

ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్.. మానసిక రోగి మృతి

04-06-2025 09:35 AM

హైదరాబాద్: ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో Erragadda Mental Hospital) రోగులు ఆస్వస్థతకు గురయ్యారు.  కలుషిత ఆహారం తిని 71 మంది మానసిక రోగులు డయేరియా బారిన పడ్డారు. రోగులు వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలను నివేదించారు. పరిస్థితి విషమంగా ఉన్న 21 మందిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 2 రోజుల క్రితం రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే డీఎంఈ, డీఎంహెచ్ వో ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల మానసిక రోగి కరణ్ ప్రాణాలు కోల్పోయాడు. మిగతావారి పరిస్థితి నిలకడగానే ఉందని ఎర్రగడ్డ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. రోగులు అనారోగ్యానికి గురైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. కలుషిత ఆహారం వల్లే ఘటన జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.