27 June, 2026 | 2:14 AM

3.66 కోట్ల విలువైన పాలసీలు జప్తు

27-06-2026 01:00 AM
  1. ప్రమోటర్ శ్రీకాంత్ భాసి బాగోతాలు బట్టబయలు
  2. ఎస్బీఐ బీమా కుంభకోణం విషయంలో ఈడీ  దూకుడు

న్యూఢిల్లీ, జూన్ ౨౬: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బీమా పాలసీల మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఈ కేసులో రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని అంచనా వేసిన ఈడీ, స్కాం వెనుక ఉన్న చీకటి కోణాలను వెలుగులోకి తెస్తున్నది. దీనిలో భాగంగానే శుక్రవారం అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏవోపీఎల్) ప్రమోటర్ శ్రీకాంత్ భాసికి చెందిన 2 ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ లైఫ్ బీమా పాలసీలను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.

జూరిచ్ ఇంటర్నేషనల్ లైఫ్ లిమిటెడ్‌లో ఉన్న ఈ పాలసీల విలువ రూ. 3.66 కోట్లు అని అంచనా. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)- 2002 కింద భోపాల్ తాజాగా ఈడీ జోనల్ ఆఫీస్ ఈ అటాచ్‌మెంట్ ఆర్డర్ జారీ చేసింది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. ఎస్బీఐకి రూ.1,266.63 కోట్ల మేర నష్టం కలిగించార ని సీబీఐ కేసు నమోదు చేసింది. 

ఏవోపీఎల్ సంస్థ, దాని ప్రమోటర్లు బ్యాంకింగ్ సదుపాయాలను దుర్వినియోగం చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వీరు బోగస్ వ్యాపారాలు, సర్క్యులర్ ట్రేడింగ్, నకిలీ ట్రేడ్ పత్రాల సష్టికి పాల్పడినట్లు తేలింది. బ్యాంక్ నిధులను దేశీయ, విదేశీ సంస్థలకు మళ్లించినట్లు నిర్ధారణ జరిగింది. సొమ్మును శ్రీకాంత్ భాసి పలు కంపెనీ ల ద్వారా చేతులు మార్చి, దేశ, విదేశాల్లో  పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించింది.