౩9 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆరుగురి పరిస్థితి విషమం
పెద్దపల్లి, ఏప్రిల్19(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ ఎస్సీ గురుకుల బాయ్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయి ౩౨ మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం హాస్టల్‌లో టిఫిన్ తిన్న విద్యార్థులు మధ్యాహ్న సమయంలో వాంతులు చేసుకున్నారు. గమనించిన హాస్టల్ నిర్వాహకులు ౩౨ మంది విద్యార్థులను సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
గత కొంత కాలంగా హాస్టల్ కలుషిత ఆహారం, నీరు అందిస్తుండటంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ వివరణ కోరగా, ఆయన స్పందించలేదు.