వాహనాల దొంగ అరెస్టు

20-04-2024 01:38:38 AM

వరంగల్ తూర్పు, ఏప్రిల్19 : జల్సాలకు అలవాటు పడి వాహన చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి.. అతని వద్ద నుంచి నాలుగు బైక్‌లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని వరంగల్  ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నింది తుడి వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూ రు గ్రామానికి చెందిన షేక్ ఇమ్రా న్ వరంగల్ నగరంలో కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాడు. మ ద్యానికి బానిసై ఆ డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయ డం మొదలుపెట్టాడు. ఇటీవల నా లుగు బైక్‌లు, ఒక ఆటోను దొంగిలించి వాటిని వరంగల్ రైల్వే స్టేష న్ పార్కింగ్‌లో పెట్టి శుక్రవారం అందులోని ఒక బైక్‌ను తన గ్రా మానికి తీసుకువెళ్లి అమ్మేందుకు సిద్దమయ్యాడు.

అ దే సమయంలో పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా ఇమ్రాన్ తప్పించుకునే ప్రయ త్నం చేశాడు. అనుమానంతో పోలీసులు అతడిని పట్టుకుని విచారిం చగా దొంగతనా ల విషయం ఒప్పుకొన్నాడు. అతడి వద్ద ను ంచి రూ.౨లక్షల విలువైన నాలుగు బైక్‌లు, ఆటోను స్వాధీనం చేసుకొన్నామని తెలిపా రు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఇంతేజార్‌గంజ్  సీఐ శివకుమార్, ఎ స్సై వెంకన్న, హెడ్‌కానిస్టేబుల్ రవీందర్‌రెడ్డి, బిక్షపతి, కానిస్టేబుళ్లు శివకుమార్, ఉపేందర్, రాజశేఖర్‌లను ఏసీపీ అభినందించారు.