24 June, 2026 | 1:19 AM

సైబరాబాద్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

24-06-2026 12:38 AM

కంచి కేఫ్, కోడికూర చిట్టిగారె రెస్టారెంట్లకు నోటీసులు

శేరిలింగంపల్లి, జూన్ 23 (విజయక్రాంతి): సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో పుప్పాలగూడ, నల్లగండ్ల ప్రాంతాల్లోని రెండు రెస్టారెంట్లలో తీవ్రమైన పరిశుభ్రత లోపాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు ఈ రెండు రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. తనిఖీలో పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో అనేక హైజిన్ సమస్యలు గుర్తించారు. ఫంగస్ పట్టిన కాలీఫ్లవర్,ఈగలు,బొద్దింకలు (కాక్రోచెస్)తీవ్రమైన దుర్వాసన వంటి సమస్యలు బయటపడ్డాయి.

అంతేకాకుండా,వాటర్ టెస్టింగ్ రికార్డులు, పెస్ట్ కంట్రోల్ సర్టిఫికెట్లు,సిబ్బంది మెడికల్ ఫిట్నెస్ రికార్డులు లేకపోవడం వంటి తీవ్ర లోపాలు కనుగొన్నారు.అదే విధంగా నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లో కూడా లేబుల్స్ లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కిచెన్ పరిశుభ్రత ఫుడ్ లేబులింగ్ నిబంధనల్లో గణనీయమైన లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రెస్టారెంట్ల యజమానులకు నోటీసులు ఇచ్చి,నిర్దేశిత సమయంలో లోపాలను సరిద్దుకోవాలని ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇలాంటి తనిఖీలను చేస్తున్నట్లు తెలిపారు.ఈ సంఘటనలు స్థానిక రెస్టారెంట్లలో నాణ్యత పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ప్రజలు కూడా ఆహారం కొనుగోలు చేసేటప్పుడు హైజీన్ లైసెన్స్ వివరాలను పరిశీలించాలని సూచించారు.