రికార్డుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
24-06-2026 01:18 AM
రాజాపూర్ పోలీస్‌స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి
రాజాపూర్ జూన్ 23 : విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని రికార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. మంగళవారం వార్షిక తనిఖీ లలో భాగంగా రాజపూర్ పోలీస్ స్టేషన్ ను ప్రత్యేకంగా తనకి చేశారు. ఎన్ హెచ్ 44 లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పర్యవేక్షణ చేయాలని నిర్లక్ష్యమని తావు లేకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. కేసులు పెండింగ్ లో ఉంచకూడదని ప్రతి విషయంలోనూ పురోగతి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్, రాజాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






