4 July, 2026 | 2:53 AM

నాగోల్ దసరా రెస్టారెంట్‌కు ఫుడ్ సేఫ్టీ నోటీసులు

04-07-2026 01:48 AM

నాగోల్, జులై 3 (విజయక్రాంతి): నాగోల్లోని దసరా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధి కారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. కిచెన్లో ఈగలు ముసరడం, గడువు ముగిసిన మసాలా పాపడ్, సాస్లు వాడుతుండటాన్ని గుర్తించిన అధికారులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వంట సిబ్బంది గ్లౌజులు ధరించకపోవడం, హోటల్కు సం బంధించిన అవసరమైన సర్టిఫికేట్లు లేకపోవడంతో రెస్టారెంట్ యాజమాన్యానికి అధి కారులు నోటీసులు జారీ చేశారు. పరిశుభ్రత లోపించడంతో ఈ రెస్టారెంట్కు అధికారులు కేవలం 65% హైజీన్ రేటింగ్ మాత్రమే కేటాయించారు.