ప్రేమలో ఉండడం అంటే..
ఫుష్ప 2’ విజయంతో కథానాయిక రష్మిక మందన్నా మంచి జోష్‌మీదున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్, జీవిత భాగస్వామి ఎలా ఉండాలి? వంటి విషయాలపై స్పందించారు. తన లాంటి మనస్తత్వం ఉన్న వారినే తన జీవిత భాగస్వామిని చేసుకుంటానని రష్మిక చెప్పుకొచ్చారు. ‘నా భాగస్వామి నా జీవితంలో ప్రతి దశలోనూ తోడుండటంతో పాటు నాకు భద్రతనివ్వాలి.
కష్ట సమయంలో మద్దతుగా నిలవాలి. నాపై శ్రద్ధతో పాటు మంచి మనసు కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి గౌరవంతో పాటు బాధ్యతగా ఉంటే జీవితాంతం కలిసి ఉండవచ్చు. జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలి. ప్రేమలో ఉండటం అంటే నాకు సంబంధించినంత వరకూ భాగస్వామిని కలిగి ఉండటమే. తోడు లేకున్నా.. ఒడిదుడుకుల్లో మనతో ఉండి సపోర్ట్ చేసేవారు లేకున్నా జీవితానికి ప్రయోజనం ఉండదు’ అని రష్మిక చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మికకు చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వలోనే ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.






