23 May, 2026 | 1:06 PM

అర్చకుడి బలవన్మరణం

20-04-2024 12:30 AM

వరంగల్ తూర్పు, ఏప్రిల్ 19: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ అర్చకుడు బలవన్మ రణానికి పాల్పడిన ఘటన శుక్ర వారం వరంగల్‌లో వెలుగుచూ సింది. పోలీసుల వివరాల ప్రకా రం.. మార్త ఓంప్రకాశ్ (38) కాశిబుగ్గలోని ఓ ఆలయ అర్చకుడిగా వ్యవహరిస్తున్నాడు. కుటుంబంతో కలిసి ఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. రోజూలాగానే గురువారం గుడికి వెళ్లొన ఓంప్రకాశ్  రాత్రి తిరిగివచ్చాడు. ఇంట్లో అందరూ నిద్రిస్తుం డగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.