వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి
20-04-2024 12:30 AM
ఎంజీఎంలో అక్రమ వసూళ్లపై విచారణ
వరంగల్ తూర్పు, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభు త్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులను ఇటీవల సర్కార్ భర్తీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో 127 మంది స్టాఫ్‌నర్సు లు విధుల్లో చేరారు. వీరిలో కొందరి నుంచి ఓ మెడికల్ అధికారి, హెడ్ నర్స్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ విచారణ చేపట్టారు. ఆయన పలువురు సిబ్బందితో పాటు స్టాఫ్‌నర్సులనూ విచారిం చారు. నివేదికను వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపారు.






