23 May, 2026 | 2:00 PM

Breaking News

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •   భాష ఏదైనా.. ఫిర్యాదు సులభం.! 'ఏఐ కాప్‌రైట‌ర్' యాప్ ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ   •   జమ్ని ఊర్లో హైమాస్ట్ లైట్లు మంజూరు   •   క్రిమి సంహారకాల వినియోగంలో జాగ్రత్త వహించాలి   •   జామ్‌గావ్‌లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం   •   మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాది హత్య   •   చైనాలో బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు— 82 మంది మృతి   •   బోర్లం పీఎసీఎస్ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ   •   భవన నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి   •   యాదాద్రిలో అధికారుల వైఫల్యం.. ఛాపర్ లోనే సీఎం, మంత్రులు   •  

నిధులు తెచ్చే బాధ్యత నాది

20-04-2024 12:25 AM

l కామారెడ్డి అభివృద్ధి చేసే బాధ్యత మీది

l లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దాం 

l ప్రభుత్వ సలహదారులు షబ్బీర్ అలీ

కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ‘కామారెడ్డి మున్సిపాలిటీకి నిధులు తెచ్చే బాధ్యత నాది.. అభివృద్ధి చేసే బాధ్యత మీది’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఇందుప్రియా, కాంగ్రెస్ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల కు ఇబ్బందులు తొలగించాలని, నీటి సమస్యలను పరిష్కరించాలని నూతన కార్య వర్గానికి సూచించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. కౌన్సిలర్లు ప్రజల సమస్యలను తెలుసుకొని తన దృష్టికి తీసుకరావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల్లో 5 గ్యారెంటీలను నేరవెర్చినట్టు ప్రజలకు వివరించాలని చెప్పారు. రాహూల్‌గాంధీ ప్రధానమంత్రిగా గెలిస్తే దేశవ్యాప్తంగా ఐదు సమన్యాయ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం షబ్బీర్ అలీని పలువురు గజమాలలతో సన్మానించారు.

మున్సి పల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు తొలగిస్తాని, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, మాజీ జడ్పీటీసీలు నిమ్మ మోహన్‌రెడ్డి, మామిండ్ల ఆంజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ కారంగుల అశోక్‌రెడ్డి, కౌన్సిలర్లు అన్వర్, శంకర్‌రావు, రవీందర్‌గౌడ్, కృష్ణమూర్తి, రాజు, కన్నయ్య, మామిండ్ల రమేశ్, సలీం, వనిత, లత, జ్ఞానేశ్వరీ, అనూష, రూప, మానస తదితరులు పాల్గొన్నారు.