23 June, 2026 | 7:53 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

గ్యాస్ పైప్‌లైన్‌కు అటవీ భూమి

03-09-2024 12:16 AM

ఉత్తర్వులు జారీ చేసిన అటవీ, పర్యావరణ శాఖ 

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మెదక్ అటవీ డివిజన్ పరిధిలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్‌కు 0.0477 హెక్టార్ల భూమి కేటాయిస్తూ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి ఆహ్మద్ నదీం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రాహింపూర్ రామాయంపేట పరిధిలో బోనాల నుంచి శివాయంపల్లి రోడ్డుపై భూ బదిలికి అనుమతించింది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే భూ బదిలి చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండేళ్ల వరకు ఈ అనుమతి ఉంటుందని, సదరు సంస్థ నిర్మాణాలు చేపట్టకపోతే అనుమతి రద్దవుతుందని వెల్లడించారు.